- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు.. నిబంధనలకు తిలోదకాలు
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు వ్యాపార నిలయాలుగా మారాయి.

దిశ, ఆమనగల్లు/కడ్తాల్ : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు వ్యాపార నిలయాలుగా మారాయి. రాష్ట్ర రాజధాని సమీపంలో ఉన్న కడ్తాల్ మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు వెలుస్తున్నాయి.
అర్హత లేని ఉపాధ్యాయులతో బోధన..
ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేటు పాఠశాలలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ కోర్స్ పూర్తి చేసి, టీచర్ ఎలిజబుల్ టెస్టు పాస్ అయి ఉండాలి. కానీ మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఆ నిబంధనను పాటించకపోవడం గమనార్హం.
నిబంధనలకు తిలోదకాలు…
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. పట్టణాల్లో 1000 చదరపు మీటర్లు, గ్రామాల్లో 2000 మీటర్ల ఆటస్థలం ఉండాలి. విశాలమైన తరగతి గదులు ఉండాలి కానీ ఇవేమీ పాటించడం లేదు.
అనుమతులు నిల్...ప్రచారం ఫుల్..
కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో లిటిల్ ఓక్స్ స్కూల్ అనుమతులు లేకుండానే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నాణ్యమైన విద్య అందిస్తామంటూ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. కానీ ఆ పాఠశాలకు విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లభించలేదు. దీనిపై మండల విద్యాశాఖ అధికారులు మౌనం వహించడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..
కడ్తాల్ మండలంలో ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేట్ పాఠశాలలు 12 కలవు. ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యా సంస్థలు నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రావిచేడ్ లో ఎలాంటి ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు లేవు. చర్యలు తీసుకుంటాం అని కడ్తాల్ మండల విద్యాధికారి నిర్మల పేర్కొన్నారు.






