ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం

by Ratna Kumari |

ప్రజలకు మెరుగైన, నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.

ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం
X

దిశ, రాజేంద్రనగర్ : ప్రజలకు మెరుగైన, నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బుధవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. కాలనీలో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ, పార్కుల సుందరీకరణ పనుల పురోగతిని ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్, ప్రతి కాలనీని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులతో హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనంజయ్, సరికొండ వెంకటేష్, ప్రేమ్ గౌడ్, కాశిగారి యాదగిరి, సోమ శ్రీనివాస్ గుప్తా, లక్ష్మారెడ్డి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Next Story