మెరుగైన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

by Ratna Kumari |

ఆలేరు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.

మెరుగైన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
X

దిశ, రాజాపేట : ఆలేరు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం రాజాపేట మండలంలోని మొల్లగూడెం–కాశగూడెం బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో నాణ్యమైన రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం ద్వారా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించడంతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలందరికీ ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లగూడెం గ్రామ సర్పంచ్ జెన్నెపల్లి బాలరాజ్ రెడ్డి, ఉపసర్పంచ్ రెడ్డబోయిన కవిత, వార్డు సభ్యులు నీల కనకమ్మ, గొడుగు బ్రహ్మయ్య, నీల జహంగీర్, గొడుగు కల్పన, బోయిని నాగరాజు, ఎంపీడీవో నాగవేణి, ఆర్‌ఐ నర్సింలు, రేనీకుంట పీఏసీఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిల్వేరు బాలరాజు గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడిగి పెంటయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఇంజా నరేష్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంగ నరేష్ గౌడ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెవుల లింగం, రేగు సిద్ధులు, రాజాపేట ఉపసర్పంచ్ నమిల కేదారి గౌడ్, బల్ల మహేష్, పంచాయతీ కార్యదర్శి, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story