- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
నియోజకవర్గంలోనే పోచంపల్లి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

దిశ, భూదాన్ పోచంపల్లి : నియోజకవర్గంలోనే పోచంపల్లి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనుల పురోగతి పై ఆయా శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం క్యాచ్ ద రైన్ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా ఇవి స్వచ్ఛ పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎండీఏ ద్వారా నియోజకవర్గానికి రూ. 56 కోట్ల రూపాయలు తీసుకువచ్చామని, మినీ ట్యాంక్ బండ్, రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్, వైకుంఠధామాలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు, అమృత్ పథకం కింద రిజర్వాయర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 7.90 కోట్ల నిధులు కేటాయించామని, గడువులోగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు ఈవీ పారిశుధ్య వాహనాలను అందించడం జరిగిందని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ కొయ్యడ రజిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉప్పునూతల వెంకటేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు భారత లవ కుమార్, కౌన్సిలర్లు కొండమడుగు ఎల్ల స్వామి, రావుల జంగయ్య, పెద్దల చక్రపాణి, బాత్క లింగస్వామి, దేవరాయకుమార్, నాయకులు పాక మల్లేష్ యాదవ్, కొట్టం కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






