- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం.. సురేష్ చారి
మండలంలో సబ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న కె. సురేష్ చారిని రేవల్లి మండల నూతన విద్యుత్ ఏఈగా జిల్లా అధికారులు ఎట్టకేలకు మంగళవారం అప్పగించారు.

దిశ, రేవల్లి : మండలంలో సబ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న కె. సురేష్ చారిని రేవల్లి మండల నూతన విద్యుత్ ఏఈగా జిల్లా అధికారులు ఎట్టకేలకు మంగళవారం అప్పగించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఏఈ పై పలు వివాదాలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మండలంలో చర్చనీయంశంగా మారగా ఆయనను విధుల నుంచి ఉన్నతాధికారులు తప్పించారు. ఇక పై మండలంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ పర్యవేక్షణ, వినియోగదారుల సమస్యల పరిష్కారం, నిర్వహణ పనులు, అత్యవసర సేవల సమన్వయం తదితర బాధ్యతలను సురేష్ చారి పర్యవేక్షించనున్నారు. మండల ప్రజలు, రైతులు, విద్యుత్ వినియోగదారులు కొత్త ఇంచార్జి ఆధ్వర్యంలో విద్యుత్ సేవలు మరింత మెరుగుపడాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా, విద్యుత్ శాఖ పై ప్రజల్లో నమ్మకం మరింత పెంచే విధంగా తన ఉద్యోగ విధులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.






