- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం
ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు.

దిశ, రాజేంద్రనగర్ : ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా సోమవారం రెండు ప్రధాన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ. 90.20 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. రాజేంద్రనగర్ డివిజన్‌లోని న్యూ గ్రీన్ సిటీ కాలనీలో రూ. 67.80 లక్షలు, బుద్వేల్ సిగ్నేచర్ అపార్ట్‌మెంట్ సమీపంలో రూ. 22.40 లక్షల వ్యయంతో మరో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం తన లక్ష్యమని అన్నారు. రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అన్ని రంగాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని ఆధునిక మౌలిక వసతులతో కూడిన ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కోట్ల రూపాయల నిధులను తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలుకుచెరువు మహేష్, పడమటి శ్రీధర్ రెడ్డి, మాడూరి ప్రభాకర్ రెడ్డి, పెండ్యాల శ్రీధర్, రగడపల్లి శ్రవణ్ కుమార్, నందిగామ నరసింహ, జాన్ పాల్ తదితరులు పాల్గొన్నారు.






