- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందడమే లక్ష్యం: తహశీల్దార్ ఝాన్సీ రాణి
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మల్దకల్ తహశీల్దార్ ఝాన్సీ రాణి ఆదేశించారు.

దిశ, మల్దకల్: అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మల్దకల్ తహశీల్దార్ ఝాన్సీ రాణి ఆదేశించారు. శనివారం మండలంలోని నీలిపల్లి గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ-2026(SIR) ప్రక్రియను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిధిలోని వార్డులలో విధులు నిర్వహిస్తున్న బీఎల్ఓల పనితీరును ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బీఎల్ఓలు, బీఎల్ఏలతో మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రజలు నిర్లక్ష్యం వీడాలి..
సొంత ఊరిలో అందుబాటులో లేని వారు, ఇటీవల ఇళ్లు మారిన కుటుంబాలు, ఓటర్ లిస్టులో పేరు లేదని ఆందోళన చెందుతున్న అర్హులైన ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ కోరారు. ఓటు హక్కు పై ప్రజలు నిర్లక్ష్యం వీడాలని, అర్హులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటును కోల్పోవద్దని పిలుపునిచ్చారు. తగిన అవగాహనతో వెంటనే ఆన్‌లైన్ ఎన్యూమరేషన్‌లో భాగస్వాములు కావాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అలాంటి వారిని గుర్తించి, పూర్తి వివరాలతో ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు నమోదైన ఓటర్ల వివరాల రికార్డులు ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మహేందర్, సీనియర్ అసిస్టెంట్ కరీం, జీపీఓలు, బీఎల్ఓలు, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.






