ఆ కుటుంబంలో అమ్మాయి పుట్టిందని.. హెలికాప్టర్‌లో గ్రాండ్ వెల‌కమ్

by Disha Web Desk 12 |
ఆ కుటుంబంలో అమ్మాయి పుట్టిందని.. హెలికాప్టర్‌లో గ్రాండ్ వెల‌కమ్
X

దిశ, వెబ్ డెస్క్: అమ్మాయి పుడితే భారంగా చూసే ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టి మొదటి సారి ఇంటికి ఏ విధంగా స్వాగతం పలికారో చూస్తే ఆశ్చర్య పోక తప్పదు. తల్లిదండ్రులు గా మారడం అనేది ప్రతి జంట జీవితంలో అంతులేని ఆనందాన్ని నింపుతుంది. ఇందులో భాగంగా ఒక కుటుంబం రూ. 1 లక్ష ఖర్చు పెట్టి హెలికాప్టర్‌లో నవజాత శిశువుని ఇంటికి తీసుకెళ్లారు. పూణేలోని షెల్‌గావ్ కు చెందినన ఓ కుటుంబం తమ నవజాత ఆడబిడ్డకు ఈ విధంగా ఘన స్వాగతం పలికారు. తమ కుటుంబంలో జన్మించిన మొదటి ఆడపిల్ల కావడంతో కుటుంబం ఈ గ్రాండ్ హోమ్ కమింగ్‌ను ఏర్పాటు చేశారు.

"మా కుటుంబం మొత్తంలో మాకు ఆడపిల్ల లేదు. కాబట్టి మాకు పుట్టిన మొట్ట‌మొదటి అడపిల్ల కావడం వల్ల రూ.1 లక్ష లతో హెలికాప్టర్‌లో ఘనంగా ఇంటికి స్వాగతం పలికాము" అని నవజాత శిశువు తండ్రి విశాల్ జరేకర్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయగా వీక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను సాదించుకుంది. అలాగే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన వారంతా ఆడపిల్ల పుట్టడాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నందుకు దేశవ్యాప్తంగా ఈ జంటను ప్రశంసిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed