- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రన్నింగ్‌లో ఊడిన '102' చక్రం.. వాహనంలో శిశువుతో బాలింత!
దిశ, వేములవాడ: కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామానికి చెందిన ఒక మహిళ డెలివరీ కోసం వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో చేరింది.

X
దిశ, వేములవాడ: కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామానికి చెందిన ఒక మహిళ డెలివరీ కోసం వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో చేరింది. పాప జన్మించిన తరువాత డిశ్చార్జి అయ్యింది. ఈ క్రమంలో ఆమెను తన స్వగృహానికి 102 వాహనంలో తీసుకెళ్తుండగా.. మార్గంమధ్యలో ప్రమాదవశాత్తు వాహనం ముందు చక్రం ఊడిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో తల్లీబిడ్డలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది మరొక వాహనాన్ని సమకూర్చి ఆమెను తన స్వగ్రామానికి తరలించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 102 వాహన సిబ్బందిపై అధికారులు ఏం చర్యలు తీసుకొంటారో వేచి చూడాలి.
Next Story






