వాళ్లను బర్రెలతో పోల్చిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

by Disha Web Desk 2 |
వాళ్లను బర్రెలతో పోల్చిన ఆర్ఆర్ఆర్ టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శక ధీరుడు SS రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. విడుదలై దాదాపు పది రోజులు కావొస్తున్నా.. ప్రపంచ దేశాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. ముఖ్యంగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. గత రికార్డులను తిరగరాస్తూ.. అద్భుతమైన కలెక్షన్లు రాబడుతున్నది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించారు. ఇద్దరు ఉద్యమ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల్లో జీవించేశారు. వీరిద్దరూ అన్నదమ్ముల్లా నటించడంతో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్‌కు పైరసీ నుంచి పెద్ద షాక్ ఎదురైంది. కొందరు వ్యక్తులు ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఫుల్ హెచ్‌డీ లీక్ కావడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా పోస్టు పెడుతూ.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌‌గా ఉండటం కాదు. ముందు యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వీడియోను డిలీట్ చేయించి, లీకుల పర్వం ఆగే విధంగా చూసుకోవాలని సూచించాడు. దీనికి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం స్పందిస్తూ.. ''మేము తీస్తూనే ఉన్నాం.. బర్రెలు వేస్తూనే ఉన్నాయి'' అంటూ లక్ష్మీ సినిమాలో వేణుమాధవ్ పేడ తీస్తున్న వీడియోను షేర్ చేశారు.


Next Story

Most Viewed