- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాన్న నీ వెంటే.. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు కూడా..
by Satheesh |
దిశ, కొందుర్గు: చౌదరిగూడ మండల పరిధిలోని జాకారం గ్రామంలో తండ్రి,- latest Telugu news

X
దిశ, కొందుర్గు: చౌదరిగూడ మండల పరిధిలోని జాకారం గ్రామంలో తండ్రి, కొడుకులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అప్పుల బాధలు, భూ సమస్యలతో గ్రామానికి చెందిన ఉగ్గి అంజయ్య(53) అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక అతని కుమారుడు ప్రవీణ్(23) కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకేరోజు తండ్రి, కొడుకులు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై అంజయ్య భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






