- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుమారం రేపుతున్న ఎప్‌స్టీన్ ఫైల్స్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎప్‌స్టీన్ ఫైల్స్, వీడియోలు, న్యూస్ వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎప్‌స్టీన్ ఫైల్స్, వీడియోలు, న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ కు సంబందించిన 2 వేలకు పైగా వీడియోలు, 30 లక్షలకు పైగా డాక్యుమెంట్లు విడుదల కాగా.. వాటిలో ఉన్న సమాచారం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా ఎప్‌స్టీన్ ఫైల్స్ లోని వీడియోలు, ఫోటోలు భయానకంగా ఉండటంతో ప్రజలు షాక్ కు గురవుతున్నారు. అంతేకాదు ప్రపంచంలోని టాప్ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రపంచ టాప్ బిజినెస్ టైకూన్స్ కు చెందిన కీలక రహస్య సమాచారం ఈ డాక్యుమెంట్స్ లో ఉండటంతో ప్రపంచ మీడియా నివ్వెరపోతోంది. అసలు ఏంటి ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్..
ఎవరీ జెఫ్రీ ఎప్‌స్టీన్?
ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటే జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే అమెరికాలో ఒక పెద్ద ఫైనాన్షియర్ గా పేరు తెచ్చుకున్న సెక్స్ ట్రాఫికింగ్ డాన్. ఇతనికి ఉన్న రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని ఆర్థికంగా పైకి ఎదిగినవాడు. అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలు, బడా రాజకీయ నాయకులతో సంబంధాలు పెంచుకున్నాడు. ఇతనికి అనేక దేశాల్లో విలాసవంతమైన ఇళ్లతోపాటు.. ఒక ప్రయివేట్ ఐలాండ్ కూడా ఉండేది. అత్యంత భారీ సెక్యూరిటీ పహారాలో 1992లోనే ఈ ఐలాండ్ లో విలాసవంతమైన నివాసం నిర్మించుకున్నాడు. ఇక అప్పటి నుంచి అతనికి సన్నిహిత సంబంధాలున్న టాప్ బిజినెస్ టైకూన్స్, ప్రపంచాన్ని శాసించే రాజకీయ నాయకులను ఆ ఐలాండ్ కు తీసుకువెళ్లి, వారికి అమ్మాయిలను ముఖ్యంగా చిన్నపిల్లలను వారి లైంగిక అవసరాలకు వస్తువుల్లా సప్లై చేసేవాడు. ఆ ఐలాండ్ కు ఎప్‌స్టీన్ ఐలాండ్ అని పేరు ఉంది. ఇందుకోసం వివిధ దేశాల్లోని అమ్మాయిలను, చిన్నపిల్లలను బెదిరించో, డబ్బు ఆశజూపో.. ప్రత్యేక విమానాల్లో ఆ ఐలాండ్ కు చేర్చేవాడు.
బిజినెస్ టైకూన్స్, వరల్డ్ టాప్ లీడర్స్..
ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తోసహా, అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా, జో బైడెన్, బిల్ గేట్స్, స్టీఫెన్ హాఫ్ కింగ్స్, లేడీ గాగా, టోనీ బ్లేయిర్, హిల్లరీ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, జాన్ కెర్రీ, మైకేల్ బ్లూమ్ బర్గ్, టెడ్ కెనెడీ,అబ్దుల్లాహ్ బిన్ రియాజ్ తో సహా అనేకమంది మంది ఆ ఐలాండ్ లో జరిగే పార్టీల్లో పాల్గొనేవారు. ఆ పార్టీల్లో అక్రమంగా తీసుకువచ్చిన అమ్మాయిలతో వారు లైంగిక వాంఛలు తీర్చుకునేవారు. అంతేకాదు.. ఆ ఐలాండ్ లో చిన్నపిల్లలను కూడా తీసుకువచ్చేవారని, చిన్నపిల్లలను కూడా బలవంతంగా లైంగిక అవసరాలకు వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తెలివిగా జెఫ్రీ.. ఆ ఐలాండ్ లో అనేకచోట్ల సీక్రెట్ కెమెరాలు అమర్చి ఆ వీడియోలు, ఫొటోలతో మరింత బెదిరించి మరింత డబ్బు సంపాదించాడు.
బయటికొచ్చిందిలా..
సెక్స్ ట్రాఫికింగ్ కారణంతోనే జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019 జూలై 6న అరెస్టయ్యాడు. అయితే కొద్దిరోజులకే అంటే 2019 ఆగస్టు 10న జైలులోనే సూసైడ్ చేసుకుని చనిపోయినట్టు అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారు. ఎప్‌స్టీన్ మరణం మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. అయితే ముందు ఇదంతా ఒక మాములు కేసుగానే అంతా అనుకున్నారు. కానీ జెఫ్రీ ఎప్‌స్టీన్ కు సంబంధించిన వివరాలతోపాటు.. ఆ ఐలాండ్ లో తమ చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక, శారీరక హింసపై అనేకమంది మహిళలు ఇప్పుడు వివరాలతో సహా బయటపెట్టడంతో ఈ కేసు ఒక్కసారిగా ప్రపంచ మీడియాలో హైలెట్ అయింది. గత ఏడాది నవంబర్ లో ఎప్‌స్టీన్ నేరాల చిట్టాకు చెందిన కొన్ని వివరాలను బయట పెట్టారు. అప్పుడే ఈ కేసు అంత ఆషామాషీ వ్యవహారం కాదని, దీనివెనుక భారీ మిస్టరీ ఏదో దాగి ఉందని అంతా భావించారు. కాగా ఈకేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను అమెరికాకు చెందిన న్యాయశాఖ 30 లక్షల డాక్యుమెంట్లు, 2వేలకు పైగా వీడియో ఫుటేజిలు, ఫోటోలు, ఆడియో ఫైల్స్ ను బయట పెట్టింది. అందులో ఉన్న వీడియోలు, ఆడియోలు, ఫోటోలు చూసి ప్రపంచం అంతా షాక్ కు గురైంది. అనేకచోట్ల బాధితులను బ్లర్ చేయగా.. ఆ ఫైల్స్ ఉన్నవారంతా ప్రపంచాన్ని శాసిస్తున్న వారుగా తేలింది. దీంతో వివిధ మాధ్యమాల్లో ప్రజలు, నెటిజన్స్, ప్రముఖ అంతర్జాతీయ మీడియా ఎప్‌స్టీన్ తోసహా అందులో ఉన్నవారిపై దుమ్మెత్తిపోస్తోంది. మరి ఇంతకీ ఆ వీడియో, ఆడియో, ఫోటోలు, డాక్యుమెంట్లలో ఏముందీ..
ఒళ్లు గగుర్పాటు పొడిచే ఫోటోలు, వీడియోలు
ఇటీవలే బయటికి వచ్చిన ఆ వీడియోలు ప్రస్తుతం ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తున్నాయి. అందులో టీనేజ్ అమ్మాయిలతోసహా 4 నుంచి 10 సంవత్సరాల పిల్లలు ఉండటమే. వారితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే కొంతమంది పసిపిల్లలను చేతులు కట్టేసి ఉండగా.. వారి మొహాలు భయంతో వణికిపోతుండటం చూసేవాళ్ల గుండె మెలిపెడుతోంది. అంతేకాదు కొంతమంది చిన్నారులను చంపి వారిని ప్లాస్టర్ తో కట్టేసి కుక్కిన ఫోటోలు నిద్రపట్టనీయకుండా ఉన్నాయి. అర్థనగ్నంగా ఆ పసివారు అక్కడున్న ఆ ప్రముఖులను చూసి బెదిరిపోతూ పారిపోతున్న వీడియోలు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు దగ్గరికి రావొద్దు, అమ్మా.. అమ్మా.. అంటూ అరుస్తున్న ఆడియోలు అక్కడ ఏం జరిగి ఉంటుందోనని ఊహించడానికి కూడా వణికిపోతున్నారు. ఇక వాళ్లందరినీ ఒకే గదిలో కుక్కిన మరో వీడియో హిట్లర్ కాంన్సంట్రేట్ క్యాంపులకు ఏమీ తీసిపోకుండా ఉన్నాయి.
హత్యలు కూడా చేసారా?
అయితే ఎప్‌స్టీన్ ఫైల్స్ లో ఉన్న కొన్ని ఆడియోల్లో కొన్ని దారుణ విషయాలు బయటపడ్డాయి. అంతేకాదు అక్కడికి వచ్చిన వారికి అమ్మాయిలను, చిన్నపిల్లను చంపి వండిపెట్టేవారని, కొన్ని ఫొటోల్లో క్లియర్ గా తెలుస్తోంది.మెత్తగా గ్రైండ్ చేయబడిన వందలకొద్దీ మాంసం ఎప్‌స్టీన్ ఐలాండ్ నుంచి బీఫ్ పేరుతో తరలించబడేదని తెలుస్తోంది. ఈ కేసు విచారణ కోసం ఆ ఐలాండ్ వెళ్లిన దర్యాప్తు అధికారులకు అనేక మహిళల అస్థిపంజరాలు దర్శనం ఇచ్చాయట. అప్పటి చిన్నారులు ఇపుడు పెరిగి పెద్దై.. ఆ ట్రామా నుంచి ఇంకా బయట పడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బయటికి వచ్చిన వీడియోలు, చిత్రాల్లో ఉన్నదంతా నిజమేనని.. ఆ ద్వీపం నరకానికి నకలుగా ఉండేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
కోవిద్ మహమ్మారికి కారణం వీళ్లేనా
అయితే అమెరికా న్యాయశాఖ బయటపెట్టిన పత్రాల్లో ఒక డాక్యుమెంట్ అందర్నీ నివ్వెరపరుస్తోంది. 2019లో వచ్చిన కరోనా మహమ్మారికి పథకం రచించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచాన్ని సర్వనాశనం చేసే ఒక మహా పాండమిక్ వ్యాధికి ప్లాన్ చేయాలని 2017లో బిల్ గేట్స్ ఎప్‌స్టీన్ తో చర్చించిన ఈ మెయిల్ బయట పడటంతో.. కరోనా మహమ్మారి వెనకాల వీళ్ళ కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చాలా డాక్యుమెంట్స్ లో వివరాలు కనబడకుండా బ్లర్ చేసి ఉండటం కూడా అనేక అనుమానాలకు దారి తీస్తోంది. అంతేకాదు ఈ ఫైల్స్ విడుదలైన మరుసటి రోజే ట్రంప్ కు సంబంధించిన పత్రాలు, ఫోటోలు, వీడియోలు అన్నీ తొలగించారు. దీనిని బట్టి ఈకేసులో అసలు నిజాలు బయటికి వస్తాయన్న నమ్మకం లేదని ప్రజలు అనుకుంటున్నారు.
ఇండియాతో సంబంధాలు
జెఫ్రీ ఎప్‌స్టీన్ కేవలం అమెరికా, యూరప్ దేశాలతో మాత్రమే కాదు.. ఎమిరేట్ దేశాలు, ఆసియా దేశాలకు చెందిన బిజినెస్ టైకూన్స్, రాజకీయ నాయకుల పేర్లు బయటకి రావడం తీవ్ర సంచలనం రేపుతోంది. ఇండియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ రంగానికి చెందిన వారి పేర్లు కూడా ఉన్నాయనే వార్తలు బయటికి వచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు కూడా ఎప్‌స్టీన్ ఫైల్స్ లో ఉండటం దేశ రాజకీయాల్లో దుమారమే రేపుతోంది. అయితే ఎప్‌స్టీన్ ఐలాండ్ దారుణాలతో సంబంధాలు ఉన్నాయని ఖచ్చితంగా తెలియకపోయినా.. భవిష్యత్తులో బయటికి వచ్చే మరిన్ని ఫైల్స్ లో ఇంకా అనేకమంది పేర్లు వెల్లడవుతాయని అనుకుంటున్నారు. 'పీడోఫైల్ ఐలాండ్' గా పిలవబడుతున్నఆ ఐలాండ్ దురాగతాలు తవ్వినకొద్దీ ఎవరూ ఊహించని గుండెను మెలితిప్పే నిజాలు ప్రపంచం ముందుకు వస్తున్నాయి.
ష్.. అంతా గప్ చుప్..
అయితే ఈ దారుణాతి దారుణాల్లో బయటికి వచ్చినవాళ్లు ఎవరూ వాటిపై నోరు విప్పడం లేదు. అవన్నీ నిజాలు కానప్పుడు అబద్దాలు, అసత్య ప్రచారాలు అని ఖండించకపోవడం వల్ల అవన్నీ జరిగాయనే.. వేలకొద్దీ చిన్నారులు, అమాయకులు బిలియనీర్స్ కామవాంఛలకు బలైపోయారనే పచ్చి నిజాన్ని తప్పక నమ్మాల్సి వస్తోంది. సాటి మనిషి ప్రాణాలకు ఏ మాత్రం విలువలేని.. కేవలం కొద్దిమంది చేతుల మీద ఈ ప్రపంచం కీలు బొమ్మ అయిందనే చేదు నిజాన్ని కూడానా నెమ్మదిగా జీర్ణం చేసుకోవాల్సి వస్తోంది.






