- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాప్ లో బుక్ చేసినా కౌంటర్లో దోపిడీ..
వ్యవసాయానికి ప్రసిద్ధి చెందిన మాడ్గుల మండలంలో ఫర్టిలైజర్ షాప్ ల వ్యాపారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి.

దిశ, మాడ్గుల : వ్యవసాయానికి ప్రసిద్ధి చెందిన మాడ్గుల మండలంలో ఫర్టిలైజర్ షాప్ ల వ్యాపారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. పత్తిసీజన్ ను అదునుగా చేసుకొని ఊర్లో మూడు నుండి 10 షాపుల వరకు సిండికేట్ గా ఏర్పడి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం యూరియా కోసం యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడంతో రైతులు యాప్ లో బుక్ చేసుకుని షాపులకు వెళ్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధర 266 రూపాయలు ఉండగా 30 రూపాయల నుండి 70 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బిల్లు అడిగితే వ్యాపారులు ఇవ్వడం లేదని ఒకవేళ ఇచ్చిన 266 చూపించి అదనంగా తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇర్విన్ గ్రామంలోని సూర్య పర్టిలేజర్ షాపులో యాప్ ద్వారా బుక్ చేసిన బస్తా పై అదనంగా 40 రూపాయలు అమ్ముతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రైతు కొప్పుల వెంకటయ్య గౌడ్ తెలిపారు. షాప్ ల యజమానులు వ్యవసాయ అధికారులతో కుమ్మక్కై ఇలా చేస్తున్నారని ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ అధికారులు స్పందించి ఫర్టిలైజర్ షాపులపై తనిఖీలు నిర్వహించి దోషుల పై కఠిన చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.






