- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఔట్ స్టాండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది మేజ్"’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ నటిస్తున్న సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ‘ది మేజ్’.

దిశ, సినిమా: తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ నటిస్తున్న సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ‘ది మేజ్’. ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. రవికిరణ్ గడలాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. విడుదల చేసిన పోస్టర్‌లో లీడ్ యాక్టర్స్ ఇంటెన్స్ లుక్స్‌లో కనిపిస్తుండగా, వారి బ్యాక్ డ్రాప్‌లో ఒక మహానగరాన్ని చూపించారు. లీడ్ యాక్టర్స్ అంతా బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో ఉండటం ఆసక్తి కలిగిస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు రవికిరణ్ గడలాయ్ మాట్లాడుతూ.. ‘వాస్తవం–భ్రమ మధ్యనున్న సరిహద్దులను చెరిపేస్తూ, ప్రతి క్షణం మీ ఆలోచనలను సవాలు చేసే, జెయింట్ వీల్ ప్రయాణం లాంటి ఉత్కంఠభరితమైన సైకలాజికల్ థ్రిల్లర్‌గా మా సినిమాను రూపొందిస్తున్నాం. చివరి క్షణం వరకు తర్వాత ఏం జరుగుతుంది అనేది ఊహించలేని విధంగా తెరకెక్కించిన మా సినిమా కథలోని ప్రతి మలుపు ఆసక్తి రేపుతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా కాలం మనసులో నిలిచిపోయే అనుభూతిని కలిగిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.






