- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడ్రస్ లేని ఓట్లు 44.89 లక్షలు.. రాష్ట్రంలో SIR నివేదిక విడుదల
ఏపీ ఓటర్ల జాబితా(AP Voter List)లో సవరణలు, పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఎన్నికల సంఘం తాజాగా SIR నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ సమగ్ర పరిశీలనలో భారీ సంఖ్యలో అనర్హత ఓట్లు ఉన్నట్లు తేలింది. ...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఓటర్ల జాబితా(AP Voter List)లో సవరణలు, పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఎన్నికల సంఘం తాజాగా SIR నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ సమగ్ర పరిశీలనలో భారీ సంఖ్యలో అనర్హత ఓట్లు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఎలాంటి చిరునామా లేని ఓట్లు ఏకంగా 44.89 లక్షలు ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. మరణించినప్పటికీ ఇంకా ఓటర్ల జాబితాలో కొనసాగుతున్న వారి ఓట్లు 15.22 లక్షలుగా అధికారులు గుర్తించారు. అలాగే ఉపాధి, ఉద్యోగాలరీత్యా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు 14.43 లక్షలు ఉన్నట్లు ఈ సర్వే ద్వారా తేలింది. వీటితో పాటు ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నట్లు 7.37 లక్షల డ్యూప్లికేట్ ఓట్లను కూడా గుర్తించారు. ఈ తప్పులన్నింటినీ సరిదిద్దే ప్రక్రియలో భాగంగా ఈ నెల 31న నూతన ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, మార్పులు చేర్పులకు త్వరలోనే తగిన అవకాశం కల్పించనున్నారు.






