ఆందోళనలు విరమిస్తున్నాం : సీజేపీ కీలక ప్రకటన

by Naga Rani Yarlagadda |

తమ మూడు డిమాండ్లు నెరవేరాయని, అందుకే ఆందోళనలు విరమిస్తున్నట్లు సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ ప్రకటించారు.

ఆందోళనలు విరమిస్తున్నాం : సీజేపీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: సీజేపీతో కేంద్రం చర్చలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. నీట్ పేపర్ లీకేజీపై 36 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులతో కలిసి నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సీజేపీ తమ ఆందోళనలు విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేంద్రంతో పలు దఫాలుగా సీజేపీ బృందం చర్చలు జరపగా.. తమ ప్రధాన డిమాండ్లను వివరించింది. వాటిలో మొదటిదైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ నెరవేరింది. శనివారం మధ్యాహ్నం.. అనూహ్యంగా నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ఆయన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధానికి పంపారు. అలాగే నీట్ లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, విద్యార్థులపై నమోదు చేసిన అన్ని కేసుల్ని ఎత్తివేయడం డిమాండ్లు కూడా నెరవేరడంతో సీజేపీ ఆందోళనలు విరమిస్తున్నట్లు సభ్యుడు ఆశుతోష్ వెల్లడించారు. తమ ఆందోళనలు విరమించి వెనక్కి వెళ్తున్నట్లు ప్రకటించారు. కాగా.. కాసేపట్లో కేంద్రంతో సీజేపీ మరోమారు చర్చలు జరపాల్సి ఉండగా.. తమ డిమాండ్లన్నీ నెరవేరడంపై సీజేపీ టీమ్ హర్షం వ్యక్తం చేసింది. ధర్మేంద్రప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద కోలాహలం నెలకొంది. విద్యార్థులంతా చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నారు.

Next Story