వైభవ్ తో బౌలింగ్ కూడా చేయిస్తాం..కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

by velandi.Saikiran |

వైభవ్ ను బౌలర్ గా మార్చేందుకు భారత జట్టు బౌలింగ్ కోచ్ సునీల్ జోషి ప్రయత్నాలు చేస్తున్నారు.

వైభవ్ తో బౌలింగ్ కూడా చేయిస్తాం..కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి పిన్న‌ వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఇతడు... మొన్న జింబాబ్వేపైన అద్భుతమైన అర్థ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇలాగే కన్సిస్టెంట్ గా బ్యాటింగ్ చేస్తే... వైభవ్ మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడం గ్యారెంటీ. అలాంటి బేబీ బాస్ వైభవ్ ను బౌలర్ గా మార్చేందుకు భారత జట్టు బౌలింగ్ కోచ్ సునీల్ జోషి ప్రయత్నాలు చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ బౌలింగ్ నైపుణ్యాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం వైభవ్ బ్యాటింగ్ పైన దృష్టి పెట్టినట్లు గుర్తు చేశారు. అవసరమైతే వైభవ్ బౌలింగ్ నైపుణ్యాలను బెంగుళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పరీక్షిస్తామని స్పష్టం చేశారు. అందులో అతను మెరుగ్గా ఉంటే దానిపైన కూడా ఫోకస్ చేస్తామని వివరించారు. ఇది ఇలా ఉండగా జింబాబ్వే, భారత జట్ల మధ్య ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు రెండో టీ20 జరగనుంది. ఇప్పటికే మొదటి టీ20లో అర్థ సెంచరీ చేసి, అదరగొట్టిన వైభవ్... ఈ రెండో మ్యాచ్ కోసం సిద్ధమయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మపై వేటు పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అతని స్థానంలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ ను తీసుకు వస్తున్నారట.

Next Story