- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్
కారేపల్లి మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విత్తనాల విక్రయాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ అనుమతి లేని కంపెనీల విత్తనాలను రైతులకు అంటగడుతున్నారని ‘దిశ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ స్పందించారు.

దిశ, కారేపల్లి : కారేపల్లి మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విత్తనాల విక్రయాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ అనుమతి లేని కంపెనీల విత్తనాలను రైతులకు అంటగడుతున్నారని ‘దిశ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ స్పందించారు.ఈ మేరకు గురువారం కారేపల్లి మండలంలోని ఫెర్టిలైజర్ షాపులను ఆమె తనిఖీ చేశారు.కారేపల్లి, సీతారాంపురం, కోమట్లగూడెం గ్రామాల్లోని సొసైటీ ఫెర్టిలైజర్ సేల్ పాయింట్లతో పాటు గోమోర్ కేంద్రాన్ని ఏడీఏ తనిఖీ చేసి, గోదాంలోని స్టాక్, పీవోఎస్ మిషన్, ఫెర్టిలైజర్ యాప్‌లో నమోదైన నిల్వలను పరిశీలించారు.స్టాక్ వచ్చిన వెంటనే పీవోఎస్ మిషన్‌లో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. రైతులకు యూరియా అందుబాటులో ఉంచేందుకు అన్ని సొసైటీ సేల్ పాయింట్లలో యూరియా నిల్వ ఉంచుతున్నట్లు తెలిపారు. రైతులు వర్షాలు పడి భూమి పూర్తిగా నానిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలని సూచించారు.గ్రామాలకు వచ్చి విత్తనాలు విక్రయించే వ్యక్తుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని రైతులకు సూచించారు.ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.విత్తనాలు కొనుగోలు చేసిన రశీదులను పంట చేతికి వచ్చే వరకు భద్రంగా దాచుకోవాలని రైతులకు సూచించారు.ఈ తనిఖీల్లో ఏడీఏ వెంట ఏవో బట్టు అశోక్ కుమార్, ఏఈవో నరేష్, సొసైటీ కార్యదర్శి బొల్లు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు






