- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువనాయకుల మృతి పార్టీకి తీరని లోటు
మండలంలోని గోర్గల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జుంజూరు దినేశ్, జుంజూరు రమేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పార్టీకి తీరని లోటని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.

దిశ, నిజాంసాగర్ : మండలంలోని గోర్గల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జుంజూరు దినేశ్, జుంజూరు రమేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పార్టీకి తీరని లోటని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దినేశ్, రమేశ్‌లు దుర్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గురువారం గోర్గల్ గ్రామానికి చేరుకుని వారి భౌతిక కాయాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దినేశ్, రమేశ్‌ల అకాల మరణం అత్యంత బాధాకరం.
ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగిన ఇద్దరు యువ నాయకులను కోల్పోవడం కాంగ్రెస్ పార్టీతో పాటు సమాజానికే తీరని లోటు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని దేవుడిని వేడుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది" అని పేర్కొన్నారు. ఈ విషాదకర ఘటనతో గోర్గల్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్జం దుర్గయ్య, రామా గౌడ్, గోలి లక్ష్మణ్, అబ్దుల్ రజాక్, వినోద్ గౌడ్, పి. రమేష్, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మృతులకు ఘనంగా నివాళులర్పించారు.






