ఆలయ దర్శన విధానాల్లో కోర్టు జోక్యం చేసుకోదు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

భారత దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం ఒకటి. ఈ ప్రసిద్ధ ఆలయంలో సామాన్య భక్తుల ప్రవేశంపై గత కొద్ది రోజులుగా వివాదం నెలకొంది.

ఆలయ దర్శన విధానాల్లో కోర్టు జోక్యం చేసుకోదు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం (Ujjain Mahakaleshwar Temple) ఒకటి. ఈ ప్రసిద్ధ ఆలయంలో సామాన్య భక్తుల ప్రవేశంపై గత కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. ఈ క్రమంలో దర్పణ్ అవస్థి అనే వ్యక్తి మహాకాళేశ్వర ఆలయంలో సామాన్య భక్తులు- విఐపిల (VIP) మధ్య వివక్ష లేకుండా అందరికీ సమానంగా గర్భాలయ దర్శనం, పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు(Supreme Court) లో పిటిషన్ వేశారు. కాగా దీనిని మంగళవారం కోర్టు కొట్టివేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా పిటిషనర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పిటిషన్లు వేసేవారు నిజమైన భక్తులు (శ్రద్ధాళువులు) కాదని, వారు వేరే ఉద్దేశాలతో కోర్టులను ఆశ్రయిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆలయాల్లో దర్శన వేళలు, నిబంధనలు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం కోర్టుల పని కాదని స్పష్టం చేసింది.

తాము కేవలం చట్టబద్ధతను మాత్రమే చూస్తామని, ఆలయ సంప్రదాయాల్లోకి వెళ్లలేమని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ గర్భాలయంలోకి అందరికీ సమాన హక్కులు కల్పించాలని రాజ్యాంగంలోని 14వ అధికరణను (సమానత్వపు హక్కు) ఇక్కడ వర్తింపజేస్తే, భవిష్యత్తులో ఇతర హక్కులను కూడా ఆలయాల్లో కోరే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. దర్పణ్ అవస్థీ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన కోర్టు, ఈ అంశంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ప్రభుత్వ అధికారులకు, ఆలయ కమిటీకి విన్నవించుకోవాలని సూచించింది. ఆలయ నిర్వహణ, భక్తుల క్రమబద్ధీకరణ అనేది స్థానిక యంత్రాంగం చూసుకోవాల్సిన అంశమని తేల్చి చెప్పింది.

Next Story