- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రుటిలో తప్పిన ప్రమాదం.. కానిస్టేబుల్ కుడికాలు ఫ్రాక్చర్
దిశ, కోనరావుపేట: రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి ఓ బైకు అతివేగంగా దూసుకొచ్చి కానిస్టేబుల్‌ను బలంగా ఢీకొనడంతో కాలు విరిగింది.

X
దిశ, కోనరావుపేట: రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి ఓ బైకు అతివేగంగా దూసుకొచ్చి కానిస్టేబుల్‌ను బలంగా ఢీకొనడంతో కాలు విరిగింది. ఈ ఘటన కోనరావుపేట మండలం నిమ్మపెళ్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కోనరావుపేట మండల ఎస్ఐ ప్రేమ్ దీప్ తన సిబ్బందితో కలిసి నిమ్మపెళ్ళి శివారులో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ గుర్తుతెలియని ద్విచక్ర వాహనం అతివేగంగా వచ్చి విధుల్లో కానిస్టేబుల్ అబ్బాస్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అబ్బాస్ కుడికాలు విరిగింది. దీంతో వాహనదారున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు హుటాహుటిన అబ్బాస్‌ను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ ప్రేమ్ దీప్ తెలిపారు.
Next Story






