మరింత వణికించనున్న చలి

by Muthe.Rajitha |

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 2 వరకు చలి తీవ్రత మరింత పెరుగుతుందని IMD వెల్లడించింది.

మరింత వణికించనున్న చలి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 2 వరకు చలి తీవ్రత మరింత పెరుగుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాత్రి ఉష్ణోగ్రతలుసాధారణం కంటే 2 నుంచి 3 వరకు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. ఏపీలోని కోస్తా, రాయలసీమలో చలి మరింత వణికించనుందని.. ముఖ్యంగా నేడు మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, విజయనగరం జిల్లాలో ఉదయం 9 వరకు పొగమంచు కురుస్తుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటన జారీ చేసింది. ఇక తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ చలి పెరిగగా.. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెల్లవారుజామున అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ప్రజలకు సూచించింది.

Next Story