మారిపోతున్న పశ్చిమాసియా ముఖచిత్రం.. ఆరో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం

by Malleboina Mahesh |

పశ్చిమాసియా యుద్ధం ఆరో రోజుకు చేరింది. ఇరాన్ 500 మిస్సైళ్లు, 2వేల డ్రోన్లతో విరుచుకుపడగా, అమెరికా ఇరాన్ వార్ షిప్ లే లక్ష్యంగా దాడులు చేస్తోంది.

మారిపోతున్న పశ్చిమాసియా ముఖచిత్రం.. ఆరో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం (Iran-Israel, US war) నేటితో ఆరో రోజుకు చేరుకుంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు పరస్పరం భీకర దాడులకు (Fierce attacks) దిగుతుండటంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ క్రమంలో అమెరికా సైతం రంగంలోకి దిగి ఇరాన్ వార్ షిప్ లే లక్ష్యంగా దాడులు చేపట్టింది. మరోవైపు ఇరాన్ (Iran) కూడా వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ పై బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.

ఇరాన్ కేవలం ఇజ్రాయెల్‌నే కాకుండా అమెరికా (America) స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ ఫ్లీట్‌ (US Navy Fleet)పై దాడి చేయడంతో పాటు ఖతార్‌లోని యూఎస్ ఎంబసీపై ఇరాన్ మరోసారి విరుచుకుపడింది. అమెరికా అధికారిక ప్రకటన ప్రకారం.. ఇరాన్ ఇప్పటివరకు 500కు పైగా బాలిస్టిక్ మిస్సైల్స్, 2,000కు పైగా డ్రోన్లను ప్రయోగించి యుద్ధాన్ని మరింత తీవ్రం చేసింది. అలాగే అమెరికా సైతం రంగంలోకి దిగి ఇరాన్ పై భారీ దాడులు చేస్తుంది. దీంతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌ (Middle East Countries)లో పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది.

Next Story