గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం పటిష్ట చర్యలు.. మేడారం సాక్షిగా కేంద్ర మంత్రి జోయల్ ఓరం ప్రకటన

by Malleboina Mahesh |

దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పటిష్టమైన చర్యలు చేపడుతోందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం స్పష్టం చేశారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం పటిష్ట చర్యలు.. మేడారం సాక్షిగా కేంద్ర మంత్రి జోయల్ ఓరం ప్రకటన
X

దిశ, మేడారం న్యూస్ నెట్‌వర్క్: దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పటిష్టమైన చర్యలు చేపడుతోందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం స్పష్టం చేశారు. గురువారం మేడారం మహా జాతరను సందర్శించిన ఆయన, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశ పురోగతిలో పది కోట్ల మందికి పైగా ఉన్న ఆదివాసీలు, గిరిజనులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కొనియాడారు. వారి సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా 20 వేల గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ. 24 వేల కోట్లతో ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడబోమని మంత్రి జోయల్ ఓరం హామీ ఇచ్చారు.

విద్యా రంగానికి పెద్దపీట: గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో 23 ఏకలవ్య పాఠశాలలను రూ. 500 కోట్లతో ఆధునీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే, ములుగులో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క-సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ద్వారా ఈ ప్రాంత యువతకు అంతర్జాతీయ స్థాయి విద్యావకాశాలు లభిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని జాతీయ దినోత్సవంగా ప్రకటించడం గిరిజన జాతికి కేంద్రం ఇచ్చిన గౌరవమని ఆయన పేర్కొన్నారు.

Next Story