ప్రాణం మీదకు తెచ్చిన సరదా.. బెలూన్ ఊడిపోయిన బాలుడి పరిస్థితి విషమం

by Dishanational2 |
ప్రాణం మీదకు తెచ్చిన సరదా.. బెలూన్ ఊడిపోయిన బాలుడి పరిస్థితి విషమం
X

దిశ ,ఆదిలాబాద్: ఈత సరదా బాలుడి ప్రాణాల మీదకు వచ్చింది. స్విమ్మింగ్ పూల్లో సరదాగా గడుపుతున్న ఓ బాలుడు బెలూన్ ఊడిపోయి నీట మునిగి పోయాడు. కెమికల్ వాటర్ తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన పదకొండేళ్ల శ్రీకర్ శుక్రవారం తన తండ్రితో కలిసి స్విమ్మింగ్ పూల్‌కు వెళ్ళాడు. ఉదయం బ్యాచ్‌లో తోటి చిన్నారులతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ సరదాగా గడిపాడు. అనుకోకుండా శ్రీకర్ ధరించిన బెలూన్ ఊడిపోయి నీటమునిగాడు. తోటి చిన్నారులు అరుపులు కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది శ్రీకర్‌ను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అప్పటికే శ్రీకర్ కెమికల్ వాటర్ తాగేశాడు. పరిస్థితి విషమించ‌గా.. సిబ్బంది హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు వైద్యులు పేర్కొన్నాడు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Next Story