RRR సక్సెస్‌ను తట్టుకోలేకపోతున్న బాలీవుడ్.. ఆ ఇద్దరి వ్యవహారంతో జక్కన్న షాక్!

by Disha Web Desk 19 |
RRR సక్సెస్‌ను తట్టుకోలేకపోతున్న బాలీవుడ్.. ఆ ఇద్దరి వ్యవహారంతో జక్కన్న షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్‌లతో దూసుకుపోతోంది. ప్రపంచం మొత్తం అదిరిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. ఇటీవల తెలుగు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. బాహుబలితో మొదలైన ఈ పరంపర.. పుష్ప, ఆర్ఆర్ఆర్‌‌తో మరింత ఎక్కువైంది. తెలుగు సినిమాల ప్రభావం ఎంతలా ఉందంటే.. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రికార్డ్‌లను సైతం తుడిచిపెడుతున్నాయి. దీనితో టాలీవుడ్ ఎదుగుదలను బాలీవుడ్ ఓర్వలేకపోతుంది. తాజాగా ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ సక్సెస్ మీట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది.

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన జక్కన్న.. సినిమాలో అన్ని పరిశ్రమలు నటులు ఉండేలా పక్కా ప్లాన్ చేసుకున్నాడు. దీనిలో భాగంగానే బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగణ్, ప్రముఖ హీరోయిన్ అలియా భట్‌లను తీసుకున్నారు. అయితే సినిమాలో కీలక పాత్రలు పోషించిన వీరు.. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఇటీవల ముంబైలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌ కార్యక్రమానికి హాజరు కాలేదు.

వీరే కాకుండా బాలీవుడ్‌కు చెందిన అగ్ర హీరోలు ఎవరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇతర నటులు హాజరవ్వకున్న పర్వాలేదు కానీ.. సినిమాలో కీలక పాత్రల్లో నటించిన వారు కూడా రాకపోవడంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ ఎదుగుదలను బాలీవుడ్ ఓర్వలేకపోతోందని నెటిజెన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.


Next Story