అనన్య పాండేకు ఏమైంది? చేతికి కట్టుతో కనిపించి షాకిచ్చిన బ్యూటీ!

by Mallepaka Hamsa |

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే(Ananya Panday) తన లేటెస్ట్ ఫొటోతో అభిమానులను కాస్త కంగారు పెట్టింది.

అనన్య పాండేకు ఏమైంది? చేతికి కట్టుతో కనిపించి షాకిచ్చిన బ్యూటీ!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే(Ananya Panday) తన లేటెస్ట్ ఫొటోతో అభిమానులను కాస్త కంగారు పెట్టింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో కలర్‌ఫుల్ ఫొటోలతో సందడి చేసే ఈ భామ, తన చేతికి ఫ్రాక్చర్ అయినట్లు వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తను షేర్ చేసిన ఫొటోలో అనన్య చేతికి పట్టి వేసుకుని కనిపించింది. ఇక ఈ పోస్ట్‌కు ‘‘ఈ సంవత్సరం దిష్టి తగిలింది’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు ‘‘అసలేమైంది అనన్య?’’ అంటూ ఆరా తీస్తున్నారు. అయితే ఈ గాయం షూటింగ్‌లో జరిగిందా లేక ఇంట్లో ప్రమాదవశాత్తూ అయ్యిందా అన్నది అనన్య క్లారిటీ ఇవ్వలేదు. అనన్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె లక్ష్య‌తో కలిసి ‘చాంద్ మేరా దిల్’ (Chand Mera Dil)అనే లవ్ స్టోరీలో నటిస్తోంది. ఈ చిత్రానికి వివేక్ సోని దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో థియేటర్స్‌లోకి రాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో ఏమైనా యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు అనన్యకు ఈ గాయం అయ్యుంటుందని కొందరు అభిప్రాయపడుతుంటే, మరికొందరేమో త్వరగా కోలుకోవాలంటూ మెసేజ్ చేస్తున్నారు. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన అనన్య, ఆ సినిమా తర్వాత మళ్ళీ టాలీవుడ్‌లో కనిపించలేదు. బాలీవుడ్‌లో మాత్రం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. మరి ఈ గాయం వల్ల ఆమె సినిమాల షూటింగ్‌లకు ఏమైనా బ్రేక్ పడుతుందేమో చూడాలి. ఏదేమైనా తన క్యూట్ స్మైల్‌తో ఫోజులిచ్చే అనన్య ఇలా చేతికి కట్టుతో కనిపించడంతో ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీలవుతున్నారు.

Next Story