దారుణం.. సంచిలో తల, కాళ్లు, చేతులు లేని ఓ మహిళ మృతదేహం

by Disha Web |
దారుణం.. సంచిలో తల, కాళ్లు, చేతులు లేని ఓ మహిళ మృతదేహం
X

దిశ, నారాయణపేట : ఓ మహిళను దారుణంగా హత్య చేసి తల, కాళ్లు, చేతులు వేరు చేసి కేవలం సగ(మధ్య) భాగాన్ని సంచిలో పారేసిన ఘటన నారాయణపేట జిల్లా కేంద్ర సమీపంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా కేంద్ర శివారులోని శాసన్ పల్లి గ్రామానికి వెళ్ళే దారి పక్కన వెళ్తున్న వారికి దుర్వాసన రావడంతో సోమవారం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంచిని పరిశీలించగా... తల, కాళ్ళు, చేతులు లేని మొండెం మాత్రమే కనిపించింది.

దీంతో చుట్టూ పక్కల పరిశీలించగా ఎక్కడ మిగతా శరీర భాగాలు లభించలేదు. కాగా మొండెం వద్ద హత్యకు గురైన మహిళకు సంబంధించిన బట్టలు మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆ సంచిలో ఉన్న సగం బాడిని 4, 5 రోజుల క్రితమే ఇక్కడ పారేసినట్టు తెలుస్తుంది. అసలు హత్యకు గురైన మహిళ ఎవరు?.. ఆమెను ఎక్కడో హత్య చేసి, ఎవరు గుర్తించరాదని తల, కాళ్లను వేరు చేసి నారాయణపేట శివారులో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఆ మహిళ తల, చేతులు, కాళ్ళు విడివిడిగా నరికి వేరే వేరే ప్రాంతాల్లో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.


Next Story