- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-9 పాల్గొని ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న వారిలో దివ్య (Divya)ఒకరు.

దిశ, సినిమా: రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-9 పాల్గొని ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న వారిలో దివ్య (Divya)ఒకరు. కాంట్రవర్సీ క్వీన్‌గా పేరుతెచ్చుకున్న ఆమె ఇంట్లో ఉన్న సమయంలో నెగెటివిటిని అందుకుని విన్నర్ కాలేక హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఈ సీజన్‌లో కళ్యాణ్ పడాల విన్నర్ కాగా.. ఈ షోలో పాల్గొన్న వారంతా బయలకు వచ్చాక ఫుల్ బిజీ అయిపోయారు. ఇక దివ్య మాత్రం సంక్రాంతి బరిలో విడుదలైన చిత్రాలకు రివ్యూలు ఇస్తూ ట్రోలింగ్‌కు గురవుతోంది. తాజాగా, దివ్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాస్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana shankara vara prasad garu)మూవీకి నెగెటివ్‌గా రివ్యూ ఇచ్చింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ‘‘ఖర్చులేని యాపారం కదా.. ఈ మధ్య ప్రతి ఒక్కడూ రివ్యూవర్ అయిపోయాడు. ఫోన్ ఉంది కదా అని నోటికి వచ్చినట్లు చెప్పేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై నా మినీ రివ్యూ.
మీకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా నచ్చితే ఇది కూడా నచ్చుతుంది. అనిల్ రావిపూడి ఇప్పుడే గతంలో చేసిన చిత్రాల మాదిరిగానే ఉంది. మీకు నచ్చితే మీరు కూడా సినిమాని చూడండి’’ అని చెప్పింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. సేమ్ ఉంది అంటావా? మా బాస్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే యావరేజ్ టాక్‌లా రివ్యూ ఇస్తావా? అని ఫైర్ అవుతున్నారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 12న థియేటర్స్‌లోకి వచ్చి ఘన విజయం సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ.. పలు రికార్డులు సాధిస్తోంది. 5 రోజుల్లోనే రూ. 200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
Read More..
వాళ్లు అలా అనేసరికి నా భార్య చాలా ఫీల్ అయింది.. వెంకటేష్ ఎమోషనల్ కామెంట్స్






