భద్రంగా భద్రాచలం వారధి.. గోదావరి ఆటుపోట్లను తట్టుకుని 61 ఏళ్లు పూర్తి.. నేటికి చెక్కుచెదరని వైనం

by Jakkula.Mamatha |

ఐదు రాష్ట్రాల పెన్నిధి.. భద్రాచల వారధి 61 వసంతాలు పూర్తిచేసుకుని ఇప్పటికీ చెక్కు చెదరకుండా.. ఆనాటి ఇంజనీరింగ్ పనితనానికి ఆనవాలుగా నిలిచింది.

భద్రంగా భద్రాచలం వారధి.. గోదావరి ఆటుపోట్లను తట్టుకుని 61 ఏళ్లు పూర్తి.. నేటికి చెక్కుచెదరని వైనం
X

దిశ, భద్రాచలం: ఐదు రాష్ట్రాల పెన్నిధి.. భద్రాచల వారధి 61 వసంతాలు పూర్తిచేసుకుని ఇప్పటికీ చెక్కు చెదరకుండా.. ఆనాటి ఇంజనీరింగ్ పనితనానికి ఆనవాలుగా నిలిచింది. 1960లో భద్రాద్రి గోదావరిపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభించగా.. 1965 నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయింది. 1965 జూలై 13న అప్పటి ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంతెనను ప్రారంభించారు. వంతెన నిర్మాణం తర్వాత భద్రాచలం పుణ్యక్షేత్రంతో అభివృద్ధి చెందడంతో పాటు ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర రాష్ట్రాలకు రవాణా వ్యవస్థ మెరుగుపడి అనుసంధానంగా మారింది. ప్రతి సంవత్సరం గోదావరి వలన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కూడా వంతెన ఇప్పటికి దృఢంగా ఉందంటే.. ఆనాటి ఇంజనీర్ల గొప్పతనం అని చెప్పాలి. 1980లో భద్రాచలం వద్ద గోదావరి 75.6 అడుగులు రాగా, 1990లో 70.8 అడుగులు, 2022లో 71.8 అడుగులు మేర గోదావరి ప్రవహించినా.. వారధి ఏ మాత్రం చెక్కు చెదరకుండా తన దర్పాన్ని ప్రదర్శిస్తుంది.

సంవత్సరానికే కూలిన కొత్త వంతెన..

భద్రాచలం గోదావరి పై 1965లో నిర్మించిన వంతెనకు ప్రత్యామ్నయంగా.. పక్కనే మరో వంతెన నిర్మాణం చేపట్టారు. అయితే ఆ వంతెన ప్రారంభించిన సంవత్సరానికే కుంగి పోవడంతో ప్రస్తుతం రవాణా నిలిపివేశారు. టెక్నాలజీ ఎంత పెరిగినా ఆనాటి ఇంజనీర్ల పనితనం, నిజాయితీ నేటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు లేదనడానికి కొత్త వంతెనే నిదర్శనం.

Next Story