గాలి జనార్దన్ రెడ్డి ‘మోడల్ హౌస్’‌కు నిప్పుపెట్టిన దుండగులు.. ఎమ్మెల్యే అనుచరులపై ఆరోపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-24 04:22:51  IST  )

బళ్లారిలో రాజకీయ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సిరివార గ్రామం వద్ద ఉన్న గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి చెందిన సుమారు రూ.3 కోట్ల విలువైన మోడల్ హౌస్‌‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.

గాలి జనార్దన్ రెడ్డి ‘మోడల్ హౌస్’‌కు నిప్పుపెట్టిన దుండగులు.. ఎమ్మెల్యే అనుచరులపై ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: బళ్లారి (Bellary)లో రాజకీయ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సిరివార గ్రామం వద్ద ఉన్న గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy)కి చెందిన సుమారు రూ.3 కోట్ల విలువైన మోడల్ హౌస్‌‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ దుర్ఘటనలో సదరు భవనం పూర్తిగా కాలి బూడిదైంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గాలి జనార్థన్ రెడ్డి తన సొంత పార్టీ (KRPP) ప్రచారం, అతిథుల బస కోసం ఈ మోడల్ హౌస్‌ను ప్రత్యేకంగా నిర్మించారు. శుక్రవారం రాత్రి భవనం మంటల్లో కాలిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ఫర్నీచర్, ఇంటీరియర్ డిజైన్‌తో సహా మొత్తం ఆస్తి ధ్వంసమైందని అంచనా వేస్తున్నారు.

ఇది ఎమ్మెల్యే అనుచరులే పనే.. గాలి సోమశేఖర్ రెడ్డి

ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి (Gali Somashekar Reddy) తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షేనని ఆయన మండిపడ్డారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి (MLA Bharat Reddy) అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. జనవరి 1న జరిగిన గొడవల సమయంలోనే మా ఆస్తులను తగులబెడతామని వారు బెదిరించారని.. ఇప్పుడు అదే చేసి చూపించారంటూ ఫైర్ అయ్యారు. బళ్లారిలో రౌడీ రాజకీయం నడుస్తోందని గాలి సోమశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు స్పాట్‌లో ఆధారాలు సేకరిస్తున్నారు. అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మోడల్ హౌస్‌కు నిప్పు పెట్టారా అనే కోణంలో విచారిస్తున్నారు.

Read More..

పరిటాల రవీంద్ర పోరాటాలు ఎప్పటికీ గుర్తుంటాయి : సీఎం

Next Story