పరిటాల రవీంద్ర పోరాటాలు ఎప్పటికీ గుర్తుంటాయి : సీఎం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-24 05:40:35  IST  )

నేడు పరిటాల రవీంద్ర వర్ధంతి. ఏపీ మాజీ మంత్రి పరిటాల రవీంద్ర (Paritala Ravindra) మరణించి నేటికి రెండు దశాబ్దాలు గడిచింది. ఆయన 21వ వర్ధంతిని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు.

పరిటాల రవీంద్ర పోరాటాలు ఎప్పటికీ గుర్తుంటాయి : సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ మంత్రి పరిటాల రవీంద్ర (Paritala Ravindra) మరణించి నేటికి రెండు దశాబ్దాలు గడిచింది. ఆయన 21వ వర్ధంతిని (Death Anniversary) పురస్కరించుకొని సీఎం చంద్రబాబు నాయుడు (Chadra Babu Naidu) ఘన నివాళి అర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పరిటాల రవీంద్రతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పరిటాల పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారని సీఎం అన్నారు. ఆయన భౌతికంగా మాత్రమే దూరమయ్యారని పేర్కొన్నారు. కానీ పేదల సంక్షేమం కోసం రవీంద్ర చేసిన పోరాటాలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు.

పేదల పెన్నిధిగా గుర్తింపు

పరిటాల రవీంద్ర అనే పేరు ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనం మాత్రమే కాదు ప్రజాదరణ కలిగిన నాయకుడికి నిలువెత్తు రూపం అని ఆయన అభిమానులు చెబుతారు. ఫ్యాక్షన్ రాజకీయాలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అదే సమయంలో పేదల సంక్షేమానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి ఇంట బిడ్డగా మెలిగారు. అందుకే పరిటాల రవీంద్ర అనే పేరు వింటే అనంతపురం జిల్లాలోని పెనుకొండ ప్రజల్లో తెలియని భావోద్వేగం ఉప్పొంగుతుంది. రాయలసీమ ప్రాంతంలోని భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన పరిటాల రవీంద్ర.. వందలాది ఎకరాల భూమిని పేదలకు, దళితులకు పంచడంలో కీలక పాత్రను పోషించారు. బలహీనవర్గాలైన బోయ, కురుబ, ఈడిగ కులాలకు అండగా నిలిచి ఆయా కులాల వారికి సామాజిక భద్రతను కల్పించేందుకు శ్రమించారు. అందుకే ఆయనను పేదల పెన్నిధిగా పిలుచుకుంటారు. విద్య, వైద్యం తన ప్రజలకు కల్పించడానికి నిరంతరం కృషి చేశారు. ఆయన మరణానంతరం కూడా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా

పరిటాల రవీంద్ర ప్రజాప్రతినిధిగా అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కమ్యూనిస్టు నేపథ్యం కలిగిన నాయకుడైనప్పటికీ టీడీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. రాష్ట్ర కేబినెట్ మంత్రిగా సేవలందించారు.

Next Story