శిథిలావస్థలో ఆళ్లపల్లి రేషన్ షాప్.. వానొస్తే పేదల బియ్యం తడిసి పోవడం ఖాయం!

by Jakkula.Mamatha |

ఆళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ రేషన్ షాప్ భవనం శిథిలావస్థకు చేరింది.

శిథిలావస్థలో ఆళ్లపల్లి రేషన్ షాప్.. వానొస్తే పేదల బియ్యం తడిసి పోవడం ఖాయం!
X

దిశ, ఆళ్లపల్లి: ఆళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ రేషన్ షాప్ భవనం శిథిలావస్థకు చేరింది. గోడలకు పగుళ్లు ఏర్పడి ప్రజలకు అందిస్తున్న నిత్యావసర సరుకుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గోడలకు పగుళ్లు దశాబ్దాల క్రితం నిర్మించిన రేషన్ షాప్ భవనానికి ఎలాంటి మరమ్మతులు జరగలేదు. ప్రస్తుతం గోడలు బీటలు వారాయి. దీంతో వర్షాకాలంలో బియ్యం, చక్కెర వంటి నిత్యావసరాలు తడిసి పాడయ్యే ప్రమాదం ఉంది. రోజూ వందలాది మంది కార్డుదారులు సరుకుల కోసం ఈ రేషన్ షాప్‌కు వస్తున్నారు. ఇరుకుగా, చీకటిగా ఉన్న భవనంలో క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుంది.

పైకప్పు నుంచి సిమెంట్ ముక్కలు రాలడం వల్ల తమ ప్రాణాలకు ముప్పుగా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. "వర్షం వస్తే తడవకుండా కాపాడుకోవడమే కష్టంగా ఉంది. రేషన్ షాప్ భవనాన్ని వెంటనే మరమ్మతులు చేయించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లేదా కొత్త భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు, లబ్ధిదారులు ప్రభుత్వం, సంబంధిత అధికారులను కోరుతున్నారు. పేదలకు అందాల్సిన నిత్యావసరాలు సురక్షితంగా ఉండేలా అధికారులు స్పందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story