మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై కఠిన చర్యలు తప్పవు

by velandi.Saikiran |

ఎల్లారెడ్డిపేట మండలంలో కిరాణా, పాన్ షాప్స్, బస్టాండ్ ప్రాంతాలలో నార్కోటిక్ జాగిలంతో తనిఖీలు నిర్వహించారు.

మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై కఠిన చర్యలు తప్పవు
X

దిశ, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలంలోని కిరాణా, పాన్ షాప్స్, బస్టాండ్ పరిసర ప్రాంతాలలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఈ రోజు నార్కోటిక్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు పోలీసు అధికారులు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ఎస్ ఐ రాహుల్ రెడ్డి తెలిపారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల నిర్మూలన, భద్రతా చర్యలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

Next Story