తలకాయ లేని సినిమా యాక్టర్‌.. దేశద్రోహం కేసు పెట్టండి?: కల్వకుంట్ల కవిత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-18 12:06:37  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తలకాయ లేని సినిమా యాక్టర్ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంబోదించారు...

తలకాయ లేని సినిమా యాక్టర్‌.. దేశద్రోహం కేసు పెట్టండి?: కల్వకుంట్ల కవిత
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(AP Deputy CM Pawan Kalyan)ను తలకాయ లేని సినిమా యాక్టర్ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana Rakshana Sena President Kalvakuntla Kavitha) సంబోదించారు. జూన్ 2న తెలంగాణలో సభ పేరుతో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నించారని, ఆ సమయంలో తెలంగాణ వాదులను ఉగ్రవాదులు, వేర్పాటు వాదులతో పవన్ కల్యాణ్ పోల్చారని ఆమె మండిపడ్డారు. తెలంగాణ వాళ్లను ఇంతలా మాటలన్నా పవన్ కల్యాణ్‌పై దేశం ద్రోహం కేసు ఎందుకు పెట్టరని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. చిన్న విషయాలకే సాధారణ ప్రజలపై, సింగరేణి కార్మికులపై కేసులు పెట్టే పోలీసులు.. సినిమా వాళ్లు, ఆంధ్ర వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడంలేదన్నారు. ఆంధ్రా వాళ్లకు ఒక న్యాయం, తెలంగాణ వాళ్లకు మరో న్యాయం అమలు చేస్తున్నారా అని కవిత నిలదీశారు.

కాంగ్రెస్ ఎందుకు చలించలేదు

జూన్ 2న తెలంగాణ ప్రజలందరూ సంబురాలు చేసుకుంటుంటే పక్కరాష్ట్రమోడు వచ్చి అన్నేసి మాటలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చలించలేదని కవిత ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వమే ఇలా ఉంటే బయటోడు ఇక్కడకు రావడం సర్వ సాధారణమైన విషయమని ఎద్దేవా చేశారు. దేశం నుంచి విడిపోతామని ఎప్పుడైనా తెలంగాణ వాళ్లు అడిగారా, తెలంగాణ ఉద్యమంలోనూ వేర్పాటు వాదంపై మాట్లాడలేదని కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పవన్ కల్యాణ్ పై దేశం ద్రోహం కేసు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.

Next Story