- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లింగ సమానత్వంపై నటి షాకింగ్ రియాక్షన్.. దుమారం రేపుతున్న కామెంట్స్
బాలీవుడ్ స్టార్ నటి రాణి ముఖర్జీ(Rani Mukerji) యాక్షన్ థ్రిల్లర్ ‘మర్దానీ-3’(Mardaani-3) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి రాణి ముఖర్జీ(Rani Mukerji) యాక్షన్ థ్రిల్లర్ ‘మర్దానీ-3’(Mardaani-3) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిరాజ్ మీనావాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, బాలికల అపహరణ ముఠాపై శివాని పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఇది యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన మర్దానీ ఫ్రాంచైజీకి మూడవ భాగంగా వచ్చింది. ఇందులో రాణి ముఖర్జీ పవర్ ఫుల్ పోసీల్ ఆఫీసర్ శివానీ రాయ్‌గా నటించింది. ఈ మూవీ జనవరి 30న థియేటర్స్‌లోకి వచ్చింది. ఈనేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాణి ముఖర్జీ పలు వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడింది. నిజజీవితంలో సమాజంలోని లింగ సమానత్వం గురించి మాట్లాడుతూ.. తండ్రి ప్రవర్తనే కొడుకు వ్యక్తిత్వాన్ని మలుస్తుందని చెప్పారు. ఇంట్లో తల్లిని తండ్రి గౌరవించకపోతే, అబ్బాయిలు బయట మహిళలను అలాగే చూస్తారని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తున్నాయి.
వివాదం ఎక్కడ మొదలైందంటే.. భార్యాభర్తల సంబంధం గురించి చెబుతూ, "భర్త భార్యపై అస్సలు గొంతు పెంచకూడదని, నిజానికి భార్యే భర్తపై అరిచి మాట్లాడాలి.. అప్పుడే అంతా బాగుంటుంది" అని రాణి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తన భర్త ఆదిత్య చోప్రాను ఉద్దేశించి "ఇంట్లో ఆయన పరిస్థితి ఏంటో అడగకండి" అంటూ సరదాగా నవ్వేయడం గమనార్హం. ‘‘గౌరవం అనేది ఇంటి నుంచే మొదలవుతుంది. ఇంట్లో తల్లిని తండ్రి సరిగ్గా చూడకపోతే, బయట అమ్మాయిలను కూడా అలాగే చూడవచ్చని అబ్బాయిలు భావిస్తారు. కాబట్టి ఇంట్లో భార్యను గౌరవించే విషయంలో తండ్రులు బాధ్యతగా ఉండాలి. అప్పుడే సమాజంలో మహిళలకు దక్కాల్సిన హోదా ఏంటో అబ్బాయిలకు అర్థమవుతుంది’’ అని రాణి ముఖర్జీ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్ కావడంతో, రాణి ముఖర్జీ మాటలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంపై నెటిజన్లు స్పందిస్తూ.. "నువ్వు చెప్పే విషయాలు నవ్వు తెప్పించడం లేదు, చిరాకు కలిగిస్తున్నాయి" అంటూ మండిపడుతున్నారు. లింగ సమానత్వం అంటే ఒకరిపై ఒకరు అరవడం కాదని, భార్యాభర్తలు ఇద్దరూ పరస్పర గౌరవంతో మెలగాలని సూచిస్తున్నారు. "మహిళల హక్కుల పేరుతో పురుషులపై ఆధిపత్యం చలాయించాలని చెప్పడం సరైన పద్ధతి కాదు" అంటూ రాణి ముఖర్జీని నెటిజన్లు టార్గెట్ చేశారు. ‘మర్దానీ-3’ మూవీ టాక్ పక్కన పెడితే, రాణి ముఖర్జీ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.






