- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.40 కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన నటుడు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ స్టార్ హీరోలు పొగాకు, మద్యం బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తుండటం తరచుగా వివాదాలకు దారితీస్తుంటుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోలు పొగాకు, మద్యం బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తుండటం తరచుగా వివాదాలకు దారితీస్తుంటుంది. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లు ఇలాంటి ప్రకటనలు చేసి నెటిజన్ల నుండి ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా, సీనియర్ నటుడు సునీల్ శెట్టి(Sunil Shetty) మాత్రం తాను నమ్మని విషయాన్ని ఎప్పుడూ ప్రమోట్ చేయనని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన ఏకంగా రూ. 40 కోట్ల విలువైన ఒక పొగాకు ప్రకటనను సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ‘‘నా శరీరమే నన్ను హీరోని చేసింది, నా ఆరోగ్యం వల్లే నేను సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయికి రాగలిగాను.
నా శరీరాన్ని నేను ఒక దేవాలయంలా భావిస్తాను. దానికి అన్యాయం చేసే పని ఎప్పటికీ చేయను’’ అని సునీల్ శెట్టి పేర్కొన్నారు. రూ. 40 కోట్ల ఆఫర్ వచ్చినప్పుడు మీరు నిజంగానే నేను ఈ డబ్బుకు పడిపోతానని అనుకుంటున్నారా? అని నిర్వాహకులను అడిగినట్లు ఆయన తెలిపారు. తనకు డబ్బు అవసరం ఉన్నా సరే, తన పిల్లలు ఆహాన్, అతియా, అల్లుడు రాహుల్‌ను అవమానించేలా చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. నేటి తరం యువత తనపై చూపిస్తున్న గౌరవానికి ఇదే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించే అక్షయ్ కుమార్ (Akshay Kumar)వంటి వారు ఇలాంటి యాడ్స్ చేయడంపై గతంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో, సునీల్ శెట్టి తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అంతా మెచ్చుకుంటున్నారు.
Read More..






