మజిల్స్ ఉన్నాయి కానీ మ్యాటర్ లేదు.. ఆ హీరోపై రిమి సేన్ సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-24 04:16:08  IST  )

బాలీవుడ్ సీనియర్ నటి రిమీ సేన్(Rimi Sen) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.

మజిల్స్ ఉన్నాయి కానీ మ్యాటర్ లేదు.. ఆ హీరోపై రిమి సేన్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటి రిమీ సేన్(Rimi Sen) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. దుబాయ్‌లో ఆమె రియల్ ఎస్టేడ్ ఏజెంట్‌గా పని చేస్తోంది. ఇక ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిమి సేన్ తన సహనటుడు జాన్ అబ్రహంపై చేసిన ఘాటు వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరూ కలిసి 'ధూమ్', 'గరం మసాలా' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. రిమీ మాట్లాడుతూ.. జాన్ అబ్రహం(John Abraham)కు నటన సరిగ్గా రాదని కుండబద్దలు కొట్టారు. కేవలం తన బాడీ లాంగ్వేజ్‌కు, శరీర సౌష్టవానికి సరిపోయే పాత్రలను ఎంచుకోవడం వల్లే ఆయన ఇండస్ట్రీలో ఇన్నాళ్లు నెట్టుకొచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

జాన్ అబ్రహంకు తన పరిమితులు (Limitations) ఏంటో బాగా తెలుసని, అందుకే ఆయన చాలా తెలివిగా తన కెరీర్‌ను ప్లాన్ చేసుకున్నారని రిమీ పేర్కొన్నారు. "అతనికి గొప్పగా నటించడం రాదు, అందుకే తన లుక్స్‌ను, బాడీ కటౌట్‌ను నమ్ముకుని కేవలం యాక్షన్, గంభీరమైన పాత్రలకే పరిమితమయ్యాడు. మజిల్స్ ఉన్నాయి కానీ మ్యాటర్ లేదు" అని ఆమె చెప్పడం గమనార్హం. నటన కంటే తన ఇమేజ్‌ను ఎలా కాపాడుకోవాలో జాన్‌కు బాగా తెలుసని ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. జాన్ అభిమానులు ఆమెపై మండిపడుతుండగా, మరికొందరు ఆమె నిజాయితీని మెచ్చుకుంటున్నారు. మరి ఈ విమర్శలపై యాక్షన్ హీరో జాన్ అబ్రహం ఎలా స్పందిస్తారో చూడాలి.

Read More..

విడుదలకు సిద్ధమైన అనుపమ పరమేశ్వరన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా

Next Story