- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో సీఎం మార్పు: మాజీ డిప్యూటీ CM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విదేశీ పర్యటన ముగిసిన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉండొచ్చని అన్నారు. రేవంత్ రెడ్డి సీటు ప్రమాదంలో ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పదే పదే బీఆర్ఎస్‌ను భూస్థాపితం చేస్తామని మాట్లాడుతున్నారు.. అది ఎవరి వల్లా కాదని అన్నారు. రాష్ట్రంలో మల్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణకు భారీ విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జనవరి 19వ తేదీన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు సీఎం బృందం వెళ్లింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF) వార్షిక సదస్సులో పాల్గొననుంది. ఈ పర్యటనలో తెలంగాణ భవిష్యత్ పారిశ్రామిక దిశను నిర్దేశించే కీలక అజెండాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.






