ఆ స్టార్ హీరో ర్యాష్ డ్రైవింగ్ చేసేవాడు.. అతను అలాంటి వ్యక్తి.. నటి సంచలన కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-11-03 10:34:29.0  )
ఆ స్టార్ హీరో ర్యాష్ డ్రైవింగ్ చేసేవాడు.. అతను అలాంటి వ్యక్తి.. నటి సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: సౌత్ స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్(Dulquer Salman) గురించి స్పెషల్‌గా చప్పనక్కర్లేదు. ఈయన వచ్చిన అతి తక్కువ టైంలోనే మలయాళం(Malayalam), తమిళం(Tamil), తెలుగు(Telugu) భాషల్లో స్టార్ హీరోగా ఎదిగారు. ఇక తాజాగా ఆయన నటించిన తెలుగు సినిమా 'లక్కీ భాస్కర్'(Lucky Bhaskar) దీపావళి(Diwali)కి విడుదల అయింది. ఈ క్రమంలో యాంకర్ కమ్ నటి అయిన గాయత్రి భార్గవి(Gayathri Bhargavi).. దుల్కర్‌పై చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

నటి, యాంకర్ గాయత్రి భార్గవి లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్‌తో పాటు నటించే బ్యాంక్ ఎంప్లాయ్ రోల్ చేసింది. అలా ఈ మూవీలో చాలా సీన్స్‌లో కనిపిస్తుంది. అయితే నేడు లక్కీ భాస్కర్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మూవీ టీమ్ అంతా విచ్చేసారు. లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్‌లో గాయత్రి భార్గవి మాట్లాడుతూ.. 'దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు చెన్నైలో నా పక్కింటిలో ఉండేవారు ఆయన. కుర్రాడిగా ర్యాష్‌గా డ్రైవింగ్ చేసేటప్పటి నుంచి తెలుసు. ఇవాళ ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది' అని తెలిపింది. దీంతో గాయత్రి భార్గవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Read More..

పెళ్లయిన స్టార్ హీరో పై మోజు పడ్డ అలనాటి హీరోయిన్..! ఆయన కోసం ఏకంగా చస్తానని గొడవ..?

Advertisement

Next Story

Most Viewed