- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ బాధ్యత తల్లిదండ్రులదే’.. జిల్లా ఎస్పీ కీలక సూచనలు
యువత డ్రగ్స్‌కు బానిసలై తమ జీవితాన్ని కోల్పోతున్నారని వాటిని అరికట్టడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని, తమ పిల్లలు చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులదేనని జిల్లా ఎస్పీ జానకి అన్నారు.

దిశ, జడ్చర్ల: యువత డ్రగ్స్‌కు బానిసలై తమ జీవితాన్ని కోల్పోతున్నారని వాటిని అరికట్టడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని, తమ పిల్లలు చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులదేనని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జడ్చర్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాక్‌థాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో డిగ్రీ కళాశాల మినీ స్టేడియం నుంచి ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జానకి ప్రారంభించి అనంతరం పట్టణంలో ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం డిగ్రీ కళాశాల మినీ స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఎస్పీ జానకి మాట్లాడారు.
జిల్లాలో ఇటీవల కాలంలో యువత డ్రగ్స్‌కు అలవాటు పడి తమ జీవితాలను కోల్పోతున్నారని తెలిపారు. జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నందువల్ల గంజాయి వాడకం జరుగుతుందని గంజాయిని విక్రయిస్తున్న వారిపై ఇటీవల కేసులు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం తల్లిదండ్రులతో పాటు సమాజానికి కూడా ఎంతో అవసరం ఉందని అందుకోసమే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజా రక్షణలో భాగంగా పోలీస్ శాఖ తరపున కూడా తమ వంతు కృషి చేస్తుందని డ్రగ్స్ ను నియంత్రించేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని అప్పుడే డ్రగ్స్ రహిత సమాజంగా మార్చవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ ఎస్సైలు మల్లేష్, ఖాదర్, జయప్రసాద్ లతో పాటు ఫ్లై వాక్ అసోసియేషన్ అధ్యక్షులు కాల్వరాంరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు పట్టణ ప్రజలు మహిళలు, యువత పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






