డబ్బు కోసం గొడవ.. అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముడు

by Naga Rani Yarlagadda |

ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరిప్రాణం తీసింది. డబ్బుల కోసం అన్నదమ్ముల మధ్య తలెత్తిన వాదన తీవ్రస్థాయికి చేరడంతో..

డబ్బు కోసం గొడవ.. అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరిప్రాణం తీసింది. డబ్బుల కోసం అన్నదమ్ముల మధ్య తలెత్తిన వాదన తీవ్రస్థాయికి చేరడంతో.. సొంత అన్ననే కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు తమ్ముడు. ఈ ఘటన గుజరాత్ లోని అమ్రేలి నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్రేలి నగరంలోని ఓ స్లమ్ ఏరియాలో మయూర్ అనే యువకుడు తన నానమ్మ నందాబెన్ వనోడియాతో డబ్బుల విషయంలో గొడవకు దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన మయూర్.. నానమ్మను బూతులు తిడుతూ.. కత్తితో బెదిరించాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నందాబెన్ పెద్ద మనవడు మనోజ్.. గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. నానమ్మతో గొడవ పడుతున్న మయూర్ ను వారించే ప్రయత్నం చేయగా.. మరింత రెచ్చిపోయాడు.

నానమ్మతో గొడవ అన్నవైపు తిరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. కోపంతో ఊగిపోయిన మయూర్.. తన చేతిలో ఉన్న కత్తితో మనోజ్ పై దాడి చేశాడు. ఎడమఛాతీ వైపు తీవ్ర గాయం కావడంతో.. రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు మయూర్ ను కాపాడే ప్రయత్నం చేయగా.. తీవ్ర రక్తస్రావంతో మనోజ్ ప్రాణాలు కోల్పోయాడు. అన్న చనిపోవడంతో భయపడిన మయూర్.. అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నిందితుడి కోసం నగరవ్యాప్తంగా గాలించారు. నగరం దాటి పారిపోకముందే కొన్నిగంటల వ్యవధిలోనే అతడిని అరెస్ట్ చేసి, హత్యకు వాడిన కత్తిని, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని విచారిస్తున్నారు.

Next Story