- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీసా పొడిగింపు మోసం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
దీర్ఘకాలిక వీసాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

దిశ, శేరిలింగంపల్లి : దీర్ఘకాలిక వీసాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. లాంగ్ టర్మ్ వీసాల పేరుతో కేటుగాళ్లు నమ్మించి లక్షల్లో వసూళ్లు చేసినట్లు తెలిపారు. సాంకేతిక ఆధారాలతో అరెస్ట్ చేసి మొత్తం సొమ్మును రికవరీ చేశారు.. సైబర్ క్రైమ్ డిసిపి సాయి మనోహర్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరుకు చెందిన ప్రధాన నిందితుడు అర్జున్ రెడ్డితో పాటు అంజయ్య రెడ్డి సోషల్ మీడియా లో వీసా కాలం పొడిగింపు ప్రకటనలు ఇచ్చారు. వాటిని చూసిన బాధితురాలు కేటుగాళ్లను ఆశ్రయించారు. ఒకవేళ వీసా పొడిగింపు చేయలేకపోతే డబ్బు తిరిగి ఇస్తామని నిందితులు హామీ ఇవ్వడంతో వారి మాటలను నమ్మి బాధితురాలు సూచించిన బ్యాంకు ఖాతాలకు పలు విడతలుగా డబ్బును బదిలీ చేశారు. డబ్బు తీసుకున్న తర్వాత, నిందితులు తప్పుడు సమాచారం ఇస్తూ వచ్చారు. వీసా ప్రక్రియ పేరుతో వ్యక్తిగత పత్రాలను సేకరించి, ఆపై అదనపు డబ్బు కోసం డిమాండ్ చేశారు. ఆ తర్వాత వారు స్పందించడం మానేశారు. వీసా ప్రక్రియకు సంబంధించిన ఆధారాలు చూపించండి లేదా తాను తిరిగి ఇచ్చిన డబ్బులు వాపస్ ఇవ్వాలని బాధితురాలు గట్టిగా నిలదీయడంతో మోసగాళ్లు బండారం బయటపడింది. దీర్ఘకాలకు వీసాలు ఇప్పిస్తామని అనేక మందిని మోసం చేసినట్లు ఆ తర్వాత పోలీసులు దర్యాప్తులో తేలింది. బాధితురాలు గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
రూ. 9.60 లక్షల నగదు స్వాధీనం
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేటుగాళ్ళును అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా దీర్ఘకాలిక వీసా పొడిగింపు సేవలు అందిస్తామని ప్రచారం చేయడంతో చాలామంది బాధితులు నమ్మి మోసపోయినట్లు గుర్తించారు. వీసా ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో అదనంగా డబ్బు వసూలు చేసి ఆ తర్వాత స్పందించడం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు సి డి ఆర్ విశ్లేషణ, బ్యాంకు ఖాతా ధృవీకరణ , మొబైల్ లొకేషన్ ట్రాకింగ్ ఆధారంగా, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను గుర్తించి, వారిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడి నుంచి రూ 9.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిసిపి సాయి మనోహర్ మాట్లాడుతూ వీసా, ఇమ్మిగ్రేషన్ సేవలను అందించే ఏ వ్యక్తి లేదా ఏజెన్సీ వివరాలనైనా ముందుగా సరిచూసుకోవాలని సూచించారు. సోషల్ మీడియా, వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా వచ్చిన హామీలను నమ్మి డబ్బు బదిలీ చేయవద్దు. డబ్బు చెల్లించే ముందు సరైన రశీదులు అడగాలని కోరారు. సైబర్ మోసం జరిగినట్లయితే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయడం, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (www.cybercrime.gov.in) ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు దర్యాప్తు బృందం సత్వర స్పందన ఫలితంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో పాటు, మోసగించిన మొత్తం సొమ్మును రికవరీ చేయగలిగామని, కేసును విజయవంతంగా ఛేదించడంలో గణనీయంగా దోహదపడిన సైబర్ క్రైమ్స్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రవీందరెడ్డిని ఆయన ప్రశంసించారు.






