- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gen Zలో సరికొత్త మార్పు.. ఆ అలవాట్లను వదులుకుంటున్న యువత!
ఒక వైపు మద్యం, ధూమపాన అలవాట్లను వదులుకోవడంతోపాటు మరోవైపు బర్న్ అవుట్ సమస్యలను మేనేజ్ చేసే అంశాలపై ఆధునిక యువత ఫోకస్ చేస్తోంది.

దిశ, ఫీచర్స్ : ఓ పదేళ్లక్రితం నాటి యువతతో పోలిస్తే.. నేటి యువత అనేక విషయాల్లో ప్రత్యేకంగా ఆలోచిస్తోందని, ఆరోగ్యకరమైన అలవాట్లవైపు మొగ్గు చూపుతోందని ఒక అధ్యయనం పేర్కొన్నది. ముఖ్యంగా జెన్ జీ(Gen Z)లు హెల్తీ లైఫ్, క్రమశిక్షణ పట్ల వీరిలో ఆసక్తి పెరుగుతోందని తెలిపింది. పర్సనల్‌గా, సామాజికంగా ఎవరికీ ఇబ్బంది కలిగించని సంతోషకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్న ధోరణి వ్యాపిస్తోందని స్పష్టం చేసింది. ఇవేకాకుండా ఇంకా అనేక విషయాల్లో యువతరం తమ అలవాట్లను మార్చుకునేందుకు ఇట్రెస్ట్ చూపుతోంది. ఇంతకీ ఏమిటవి? ఉపయోగాలేమిటో ఇప్పుడు చూద్దాం.
యువతలో దూకుడు తనం ఎక్కువ అంటుంటారు కొందరు. కానీ ఇంటర్నేషనల్ ఆల్కహాల్ బేవరేజ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(IWSR) నిర్వహించిన ఒక అధ్యయనం మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలను వెల్లడించింది. ప్రధానంగా భారతదేశంలోని యువత గత తరాలకంటే చాలా తక్కువ మద్యం సేవిస్తున్నదని, ఇక నుంచి మద్యం, ఇతర మత్తు పానీయాలను పూర్తిగా వదులుకోవాలని భావిస్తున్నవారి సంఖ్య పెరుగుతోందని, అనేకమంది క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకునే ప్రయత్నం చేస్తు్న్నారని పేర్కొన్నది.
మద్యం వద్దు.. ఆరోగ్యమే ముద్దు
అంతర్జాతీయ ఆల్కహాల్ పానీయాల పరిశోధన సంస్థ అధ్యయన నివేదిక ప్రకారం.. జెన్‌జీలు(1997-2012 మధ్య జన్మించినవారు) మిలీనియల్స్, అంతకు మునుపటి తరాల కంటే కూడా మద్యం పట్ల తక్కువ ఆసక్తి చూపిస్తోంది. ఆరోగ్యం, క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో నిర్వహించిన సర్వేలు ఈ మార్పును స్పష్టం చేస్తున్నాయి. అంటే మద్యపాన సేవనం తగ్గించడం, చెడు అలవాట్లను ప్రశ్నించడం, మార్చుకోవడం, ఆరోగ్యం, మానసిక శాంతి కోసం వాటిని పూర్తిగా మానేయడం అనేది నేటి యువతలో వస్తున్న సరికొత్త మార్పుగా పేర్కొనవచ్చు.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పట్ల ఆసక్తి..
ఒక వైపు మద్యం, ధూమపాన అలవాట్లను వదులుకోవడంతోపాటు మరోవైపు బర్న్ అవుట్ సమస్యలను మేనేజ్ చేసే అంశాలపై ఆధునిక యువత ఫోకస్ చేస్తోంది. జీతం కంటే మానసిక శాంతి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్, ఉద్యోగ సంతృప్తికే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా 47% మంది జెన్‌జీలు తమకు జీతం లేదా గుడ్ వర్కర్ అనే టైటిల్ కంటే వర్క్-లైఫ్ బ్యాలెన్స్, వ్యక్తిగత ఆరోగ్యమే ముఖ్యమని భావిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అదే సమయంలో తమకు నచ్చని సాంప్రదాయ వ్యవస్థలను సైతం ప్రశ్నిస్తూ, తమకు నచ్చిన దారిలో నడుచుకునేందుకే నేటి యువత మొగ్గు చూపుతోంది. అంతేకాకుండా నేటి యువతలో చాలామంది స్థిరపడిపోయిన సామాజికి, ఆర్థిక నియమాలను సైతం సవాలు చేస్తున్నారు. ప్రశ్నించే తత్వం మరింత పెరుగుతోంది. ఇందుకోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటోంది. మొత్తానికి ఈ విధమైన మార్పు జెన్ Zలో క్రమంగా విస్తరిస్తోందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.






