టైట్ ఫిట్ డ్రెస్‌లో స్టైలిష్ పోజులతో ఆకట్టుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్

by Pulgam srinivas |

స్కై బ్లూ డ్రెస్‌లో అదరగొట్టిన జాక్వెలిన్.

టైట్ ఫిట్ డ్రెస్‌లో స్టైలిష్ పోజులతో ఆకట్టుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీలలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు ఎప్పుడూ ముందుంటుంది. శ్రీలంకకు చెందిన ఈ అందాల భామ హిందీ చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, తన గ్లామర్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది.




ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో చిత్రంలోని స్పెషల్ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత చేరువైంది. సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ జాక్వెలిన్ తన స్టైలిష్ లుక్స్‌తో తరచూ సందడి చేస్తుంటుంది.




ఫ్యాషన్, గ్లామర్ కలగలిపిన ఫోటోషూట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించడం ఆమెకు కొత్తేమీ కాదు. తాజాగా ఈమెకి సంబందించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.




ఈ ఫొటోల్లో జాక్వెలిన్ స్కై బ్లూ కలర్ టైట్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మెరిసిపోయింది. భుజాలపై జారేలా వదిలిన కురులు, డిఫరెంట్ యాంగిల్స్‌లో ఇచ్చిన స్టైలిష్ పోజులు ఆమె లుక్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి.




గ్లామర్‌తో పాటు ఎలిగెంట్ స్టైల్‌ను కూడా చక్కగా బ్యాలెన్స్ చేసిన ఈ ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Next Story