- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పదవీ విరమణ రోజే రామకృష్ణారావుకు కొత్త బాధ్యతలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును ముఖ్యమంత్రి సలహాదారుగా (Advisor to Chief Minister) నియమించింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును ముఖ్యమంత్రి సలహాదారుగా (Advisor to Chief Minister) నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ఎం. రఘునందన్ రావు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు (G.O.Rt.No.912) జారీ చేశారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న కె. రామకృష్ణారావు ఈ నెల 30న (జూన్ 30, 2026) పదవీ విరమణ (Superannuation) చేయనున్నారు. ఆయన రిటైర్ అయిన వెంటనే ముఖ్యమంత్రికి సలహాదారుతో పాటు ఎక్స్-అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా (Ex-Officio Special Chief Secretary) కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
ఆయన నియామక కాలపరిమితి, జీతభత్యాలు, ఇతర సేవా నిబంధనలు, షరతులను (Terms and Conditions) విడిగా జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న రామకృష్ణారావుకు రిటైర్మెంట్ రోజే అత్యున్నత పదవీ దక్కడం సచివాలయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నియామకపు ఉత్తర్వుల ప్రతులను రాష్ట్రంలోని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు, అకౌంటెంట్ జనరల్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమాచారం నిమిత్తం పంపారు.






