ఆ హీరో నా ఉద్యోగం తీసేసుకున్నాడు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్

by Mallepaka Hamsa |

వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ(Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఆ హీరో నా ఉద్యోగం తీసేసుకున్నాడు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ(Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన పలు పోస్టులతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. సినిమాలు చేసిన దానికంటే సోషల్ మీడియా(Social Media) ద్వారానే సెన్సేషనల్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రజెంట్ రాజకీయ నాయకుల బయోపిక్‌లు తెరకెక్కిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటున్నారు.

తాజాగా, ఆర్జీవీ మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్‌(Prithviraj Sukumaran)తో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు. దీనికి ‘‘ఒక డైరెక్టర్ అయిన నేను ఒక నటుడు డైరెక్ట్ చేస్తుంటే చూస్తున్నాను. పృథ్వీరాజ్ నా ఉద్యోగం మీరే తీసేసుకుంటే నేనేం చేయాలి’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక పోస్ట్ చూసిన వారంతా వీరిద్దరూ ఎందుకు కలిశారు.. పృథ్వీరాజ్ సినిమాలో ఆర్జీవీ నటిస్తున్నాడా? అని అనుమానపడుతున్నారు.

Next Story