- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: సూపర్ స్టార్ రజనీకాంత్ భావోద్వేగ ట్వీట్!
తనపై జరిగిన దూషణలను ఖండించిన నేతలు, సినీ మిత్రులు మరియు అభిమానులకు రజనీకాంత్ ధన్యవాదాలు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) పై కొందరు అసభ్యకరమైన, దూషణలతో సోషల్ మీడియా వేదిక తో పాటు, మీడియా సాక్షిగా విమర్శలు చేశారు. ఈ క్రమంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతు రజనీకాంత్ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, అన్బుమణి రామదాస్, తన స్నేహితుడు అన్నామలై సహా వివిధ పార్టీల రాజకీయ నాయకులు తనకు మద్దతు తెలపడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
రాజకీయ నాయకులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన అమీర్, ధనంజయన్ వంటి మిత్రులకు, మీడియా ప్రతినిధులకు కూడా రజనీకాంత్ ధన్యవాదాలు చెప్పారు. "అన్నిటికంటే మిన్నగా.. తాను దైవ సమానంగా భావించే నా అభిమానులు నన్ను నిలబెట్టి, ఉత్సాహపరిచిన తీరు మరువలేనిది" అంటూ ఆయన ఆవేదన, కృతజ్ఞత నిండిన మాటలను పంచుకున్నారు. తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను ఖండించిన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ప్రస్తావిస్తూ రజినీకాంత్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ, "కొంతమంది రాజకీయ నాయకులు పాత విషయాలనే పట్టుకుని వేలాడుతూ, కొత్త తరం ముందుకు రాకుండా అడ్డుపడుతున్నారు" అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఇది అధికార పార్టీకి చెందిన కొందరు నేతలను ఉద్దేశించి చేసినట్లుగా భావించి, వారు రజనీకాంత్‌పై మీడియా, సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు.






