కళావతి సిగ్నేచర్ స్టెప్‌.. శేఖర్ మాస్టర్‌కు దీటుగా చేసిన థమన్

by Web Desk |
కళావతి సిగ్నేచర్ స్టెప్‌.. శేఖర్ మాస్టర్‌కు దీటుగా చేసిన థమన్
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' రిలీజ్‌కు ముందే భారీ హైప్ సొంతం చేసుకుంది. భారీ స్టార్ కాస్టింగ్‌కు తోడు మహేశ్ న్యూ లుక్‌ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఇక ఇటీవలే విడుదల చేసిన 'కళావతి' సాంగ్‌లో మహేశ్ సిగ్నేచర్ స్టెప్ వైరల్‌గా మారడంతో ఇండస్ట్రీ మొత్తం అదే మేనియా నడుస్తోంది.

మరోవైపు ఈ పాటపై ప్రిన్స్ కూతురు సితార వేసిన స్టెప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. రీసెంట్‌గా శేఖర్ మాస్టర్‌తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన మూమెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగానే కొంచెం బొద్దుగా ఉండే థమన్.. 'కళావతి' సిగ్నేచర్ స్టెప్‌ను అద్భుతంగా చేయడంపై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఆ డ్యాన్స్ మూవ్స్‌పై ఓ లుక్కేయండి!






Next Story

Most Viewed