- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఇంట్లోనూ ఒక విజయ్ ఉన్నాడు.. నన్ను ఆపలేరు": సీఎం స్టాలిన్‌పై దళపతి విజయ్ నిప్పులు!
"తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తంజావూరు బహిరంగ సభలో సీఎం స్టాలిన్ మరియు డీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు

దిశ, వెబ్ డెస్క్: త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ సుడిగాలి పర్యటను చేస్తున్నారు. ఈ క్రమంలో తంజావూరులో బుధవారం ఉదయం జరిగిన భారీ బహిరంగ సభలో అధికార డీఎంకే ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయంగా తనను అణచివేయాలని చూస్తే సాధ్యం కాదని హెచ్చరించారు. "సీఎం గారు.. మీరు నన్ను నిశ్శబ్దంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు, కానీ తమిళనాడులోని ప్రతి ఇంట్లో ఉన్న 'విజయ్'ను మీరు ఆపలేరు" అంటూ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయం ఖాయమని, తమ ప్రభుత్వం ఏర్పడటం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల పోరును క్రికెట్‌తో పోల్చిన విజయ్.. డీఎంకే (DMK) ప్రచారం చేస్తున్న 'టీమ్ ఢిల్లీ వర్సెస్ టీమ్ తమిళనాడు' నినాదాన్ని ఎద్దేవా చేశారు. క్రికెట్‌లో కూడా ఢిల్లీ టీమ్ తమిళనాడు టీమ్‌ను గెలవలేదని, ఇక్కడ "తమిళనాడు అంటే టీవీకే.. టీవీకే అంటే తమిళనాడు" అని స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వం కేవలం పథకాలను ప్రకటిస్తోందే తప్ప అమలు చేయడం లేదని, తమ ప్రభుత్వం వస్తే ఐదేళ్లలోనే అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నీట్ (NEET) పరీక్ష రద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని, కేవలం ఆర్థిక భారమనే సాకుతో కనీస సౌకర్యాలను కూడా కల్పించడం లేదని దుయ్యబట్టారు.
మత్స్యకారుల సమస్యలపై స్పందిస్తూ.. శ్రీలంక నౌకాదళం మన మత్స్యకారులను తాకడానికి కూడా భయపడేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో స్టాలిన్ ప్రభుత్వం విఫలమైందని విజయ్ ఆరోపించారు. "ముఖ్యమంత్రి అప్పుడప్పుడు లేఖలు రాసి పడుకుంటారు" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వచ్చే జన్మంటూ ఉంటే రైతు కుటుంబంలో పుట్టాలని తన కోరికని చెబుతూ, కర్షక, మత్స్యకార వర్గాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. డీఎంకేది ఒక "ఫేక్ మోడల్" మరియు "స్టాండ్-అప్ కామెడీ" ప్రభుత్వమని అభివర్ణించిన విజయ్, 2026 ఎన్నికలు తమిళనాడు చరిత్రలో ఒక అద్భుతమని, అది ముక్కోణపు పోటీగా మారబోతోందని ప్రకటించారు.






